ఈ పొరపాట్లతో బరువు పెరుగుతారు
మన అలవాట్లలో కొన్ని పొరపాట్లే మన శరీరం బరువు పెరుగుదలకు కారణం అవుతాయి. అందుకే కొన్ని విషయాల్లో నిర్లక్ష్యం వహించడం మంచిది కాదు. మన బరువుకు కారణమయ్యే కొన్ని పొరపాట్లు ఏమిటో చూద్దాం.
* చక్కని ఆరోగ్యం కోసం రోజుకు ఆరు నుంచి ఏడు గంటల నిద్ర అవసరం. అయితే రోజుకు 10 గంటలకుపైగా నిద్రపోయేవారు ఉంటారు. అలాంటివారిలో BMI పెరిగిపోయి బరువు పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. రోజూ త్వరగా నిద్రపోయి, నిద్రలేవడం ఉత్తమం.
* బెడ్రూమ్లోకి సహజసిద్ధంగా వచ్చే వెలుతురు ప్రసరించేలా చూసుకోవాలి. తెల్లారిన తర్వాత కూడా పడక గదిలోకి అసలు వెలుతురు ప్రసరించకుండా ఉంటే నిద్రలేవాలని అనిపించదు. ఈ పనుల వల్ల నిద్రపెరిగి పరోక్షంగా బరువు పెరుగుదలకు కారణం అవుతుంది. ఉదయం నిద్ర లేచిన తర్వాత శరీరానికి సూర్యరశ్మి సోకితే మంచిది.
* బ్రేక్ ఫాస్ట్ ఎట్టి పరిస్థితుల్లోనూ మానేయకూడదు. ఉదయం తిండిమాని మధ్యాహ్నం అవసరానికి మించి అతిగా తినడం అనారోగ్యకరం. ఈ అలవాటు అధిక బరువుకు కారణమవుతుంది. కనుక పిండిపదార్థాలు, మంచి పోషకవిలువలు ఉన్న బలవర్థకమైన బ్రేక్ఫాస్ట్ రోజును ప్రారంభించాలి.
These mistakes lead to weight gain
Some mistakes in our habits cause our body to gain weight. That is why it is not good to neglect some things. Let's see what are some of the mistakes that cause our weight.
* Six to seven hours of sleep a day is required for good health. But there are people who sleep more than 10 hours a day. Such people have increased BMI and are more likely to gain weight. It is best to sleep and wake up early every day.
* Make sure that natural light flows into the bedroom. Even after waking up, if there is no real light in the bedroom, you don't want to wake up. These activities lead to sleepiness and indirectly cause weight gain. After waking up in the morning, it is good if the body is exposed to sunlight.
* Breakfast should not be skipped under any circumstances. It is unhealthy to overeat in the morning and overeat in the afternoon. This habit causes excess weight. So start the day with a hearty breakfast that is rich in carbohydrates and good nutritional value.

No comments:
Post a Comment